Saturday, November 23, 2024
Homeసినిమాట్రోల్స్ కు ఎన్టీఆర్ ధీటైన జవాబు

ట్రోల్స్ కు ఎన్టీఆర్ ధీటైన జవాబు

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ గోల్డన్ గ్లోబ్ అవార్డ్ అవార్డ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డ్ సొంతం చేసుకున్న సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ… అందరిని ఆశ్చర్యపరిచారు. ఇంగ్లీష్ లో అద్భుతమైన స్లాంగ్ లో ఎన్టీఆర్ మాట్లాడిన తీరును చాలా మంది ప్రశంసించారు. జపాన్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయితే.. అక్కడకి వెళ్లి జపాన్ లో మాట్లాడాడు. ఇప్పుడు అమెరికా వెళ్లి అక్కడ స్లాంగ్ లో ఇంగ్లీషు మాట్లాడడం చూసి మన ఎన్టీఆరేనే ఇలా మాట్లాడుతుంది అని అక్కడ వాళ్లు మాత్రమే కాదు.. ఇక్కడ వాళ్లు కూడా షాక్ అయ్యారు.

అయితే… కొందరు మాత్రం ఇది అమెరికన్ యాసనా అంటూ ట్రోల్స్ చేశారు. సాధారణంగా ఇంగ్లీష్ మాట్లాడితే పోయేది కదా.. ఎందుకు ఇంతగా కష్టపడటం అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అమెరికన్ స్లాంగ్ పేరుతో ఎన్టీఆర్ అర్థం కాకుండా మాట్లాడాడు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేయడం జరిగింది. తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్లాంగ్ పై వచ్చిన ట్రోల్స్ కు స్పందించాడు ఎన్టీఆర్. దేశాన్ని బట్టి ఒక్కో యాస ఉంటుంది. ఎవరి భాష వారిది.. ఎవరి యాస వారిది అన్నట్లుగా ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఎన్టీఆర్ ను విమర్శించిన వారిని ఆయన ఫ్యాన్స్ కూడా తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నప్పటికీ  కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ 30 సినిమా వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ కు అంతా సిద్ధంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయనున్నారు అనేది ప్రకటించనున్నారు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్