Tuesday, September 17, 2024
HomeసినిమాJr Ntr, Pushpa 2: 'పుష్ప 2' సెట్ లో.. ఎన్టీఆర్.

Jr Ntr, Pushpa 2: ‘పుష్ప 2’ సెట్ లో.. ఎన్టీఆర్.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తుంది. బడ్జెట్ పరిమితి అనేది పెట్టుకోకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పుష్ప సినిమా సంచలనం సృష్టించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ సెట్ లో ఎన్టీఆర్ ప్రత్యక్షం అయ్యారు. పుష్ప సెట్ లో ఎన్టీఆర్ కనిపించి అందర్నీ సర్ ఫ్రైజ్ చేశాడు. ఈ వార్త బయటకు వచ్చింది. అంతే కాకుండా ఫార్మల్ డ్రెస్ లో ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్లిన ఫోటో బయటకు రావడం.. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. ఎందుకు పుష్ప సెట్ కి వచ్చాడంటే.. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ కి గ్యాప్ రావడంతో పుష్ప సెట్ కి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే.. ఎన్టీఆర్, పుష్ప సెట్ కి వచ్చాడని తెలిసినప్పటి నుంచి ఎందుకు వచ్చాడు. ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నాడా..?  అనేది ఆసక్తిగా మారింది.

అయితే.. ఎన్టీఆర్, బన్నీ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బర్త్ డే విషేస్ తెలియచేయడం.. పార్టీ లేదా పుష్పా అని అడగడం.. దీనికి బన్నీ.. వస్తున్నా అని రిప్లై ఇవ్వడం తెలిసిందే. ఇప్పుడు టైమ్ దొరకడం వలనే బన్నీని కలవడానికే వచ్చాడు తప్పా.. ప్రచారంలో ఉన్నట్టుగా గెస్ట్ రోల్ చేయడం కోసం కాదని సమాచారం. అలాగే వీరిద్దరి కాంబినేషన్లో బాలీవుడ్ లో ఓ మూవీ ప్లానింగ్ లో ఉందని కూడా ఆమధ్య వార్తలు వచ్చాయి. మరి.. ఫ్యూచర్ లో బన్నీ, ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్