Thursday, March 19, 2026
Homeసినిమాపాపం.. అక్క మాదిరిగానే చెల్లెలికి కూడా దక్కలేదు!

పాపం.. అక్క మాదిరిగానే చెల్లెలికి కూడా దక్కలేదు!

ఇతర భాషలతో పోల్చుకుంటే తెలుగులో రూపొందే సినిమాలు ఎక్కువ. అలాగే తెలుగు ద్వారా పరిచయమయ్యే కథానాయికలు ఎక్కువ. స్టార్ హీరోల సినిమాలలో సెకండ్ హీరోయిన్ కావాలన్నా, చిన్న సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కావాలన్నా సాధ్యమైనంత వరకూ కొత్తవాళ్లను తీసుకోవడానికే మేకర్స్ మొగ్గు చూపుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సీనియర్ స్టార్ హీరోల జోడీగా కూడా కొత్త బ్యూటీలను తీసుకొస్తున్నారు. భాష తెలియకపోయినా, గ్లామర్ తో వాళ్లు నెట్టుకొచ్చేస్తూనే ఉన్నారు.

అలా తెలుగు తెరకి పరిచయమైన మరో కథానాయికగా నుపుర్ సనన్ కనిపిస్తుంది. రీసెంటుగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె చాలా నాజూకుగా కనిపించింది. చక్కని కనుముక్కు తీరుతో కుర్రకారును ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. నుపుర్ సనన్ సిస్టర్ కృతి సనన్ కూడా తెలుగు సినిమాతోనే కెరియర్ ను మొదలుపెట్టింది. తొలి సినిమాతో హిట్ కొట్టలేకపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి నుపుర్ విషయంలోను కనిపిస్తోంది.

కృతి సనన్ హైటు కారణంగా ఇక్కడ అవకాశాలు పుంజుకోలేదనే మాట వాస్తవం. నుపుర్ సనన్ కి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. మీడియం హైటుతో .. ఒక హీరోయిన్ కి కావలసిన లక్షణాలు నుపుర్ లో పుష్కలంగా ఉన్నాయి. అందువలన ఆమె తెలుగులో కుదురుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందుగా రెండో వరుస హీరోల సరసన మెరుస్తూ వెళితే, ఆ తరువాత స్టార్ హీరోల జోడీగా అవకాశాలను అందుకోవచ్చు. ఈ రోజుల్లో ఒకటి రెండు హిట్లు పడితే చాలు స్టార్ స్టేటస్ కి చాలా దగ్గరగా వెళ్లిపోవచ్చు. ఈ అందగత్తె అదృష్టం ఎలా ఉందనేది చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular