Saturday, January 18, 2025
HomeసినిమాTiger Nageswara Rao: నుపూర్ సనన్ ఫస్ట్ లుక్ రిలీజ్

Tiger Nageswara Rao: నుపూర్ సనన్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఇటీవల గ్లింప్స్ విడుదలైన తర్వాత చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ బజ్ మరింత గా పెరిగింది. రవితేజ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్వం కు శీ దర్శకత్వం వహిస్తున్నారు.  వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ లను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌ పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. రవితేజ సరసన నూపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ రోజు, మేకర్స్ టైగర్ లవ్ సారా గా నూపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రైలు విండో సీట్లో కూర్చున్న నూపూర్ తన లవ్  ని కలుసుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఫస్ట్ లుక్ లో కనిపిస్తోంది. ఎత్నిక్ వేర్‌లో ఉన్న పోస్టర్‌లో చాలా బ్యుటీఫుల్ గా వుంది. బాలీవుడ్ నటి కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్‌ మరో హీరోయిన్. రవితేజ కెరీర్ లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు’. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్