Friday, March 20, 2026
Homeసినిమా'రుద్రమాంబపురం' టీజర్ కు అనూహ్య‌ స్పందన

‘రుద్రమాంబపురం’ టీజర్ కు అనూహ్య‌ స్పందన

Rural Background: యన్.వి.ఎల్ ఆర్ట్స్… యన్.వి.ఎల్ అంటే అలనాటి ఆంధ్ర‌ నాటక రంగస్థలంలో ఒక బ్రాండ్. హరిశ్చంద్ర, మైరావణ, ధుర్యోధన పాత్రలకు పెట్టింది పేరు. కీ. శే. శ్రీమాన్ యన్.వి.ఎల్ నరసింహచార్యులు. వారి పేరు మీద కుమారులు నండూరి శ్రీను, నండూరి రాము కలసి యన్.వి.ఎల్ ఆర్ట్స్ స్థాపించడం జ‌రిగింది. ఈ బ్యాన‌ర్‌లో అజయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస) ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతున్న‌ మొద‌టి సినిమా ‘రుద్రమాంబపురం‘.

ఈ చిత్రానికి మహేష్ బంటు దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఒక గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథ కథనాలు అందరిని ఆకట్టుకుంటాయ‌ని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నటుడు అజయ్ ఘోజ్ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల చేయ‌నున్నార‌నేది త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

Also Read : గంధ‌ర్వ నుంచి ‘కన్నులకే  కానుకవే’ పాట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular