Wednesday, May 7, 2025
HomeTrending Newsవిశాఖ వైసీపీ అఫీసుకూ నోటీసులు: దమనకాండ అంటూ జగన్ ట్వీట్

విశాఖ వైసీపీ అఫీసుకూ నోటీసులు: దమనకాండ అంటూ జగన్ ట్వీట్

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఈ ఉదయం సీఆర్దీయే అధికారులు కూల్చివేసిన గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి అధికారులు మరో షాక్ ఇచ్చారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని మరో రెండు నిర్మాణాలపై కూడా నోటీసులు ఇచ్చారు.  ఎండాడలో సర్వే నంబర్ 175/4 లో 2 ఎకరాల స్థలంలో వైసీపీ కార్యాలయం కూడా అక్రమ నిర్మాణమని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని పేర్కొన్నారు. అనుమతులు గ్రేటర్ మున్సిపల్ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకోకుండా వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేసి అక్కడ కూడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వారంలోపు స్పందించకపోతే  తదుపరి చర్యలు ఉంటాయంటూ హెచ్చరించింది.

దీనితో పాటు అనకాపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కడుతున్న భవనంపై కూడా విడిగా అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవీఎంసీ అనుమతులు లేకుండా హైవే సమీపంలో 1.75 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ఈ భూమిని ప్రభుత్వం నుంచి వైసీపీ 33 ఏళ్లు లీజుకు తీసుకుంది. ఏడాదికి ఎకరానికి కేవలం రూ.1000 చెల్లించేలా గతంలో అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చివేతపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు.  “ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన YSR Congress Party – YSRCP కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను” అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్