Sunday, January 19, 2025
HomeTrending Newsజూలైలో పాతనగర బోనాలు

జూలైలో పాతనగర బోనాలు

హైదరాబాద్ పాత నగర ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను (Bonalu) వైభవంగా నిర్వహిస్తామని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్‌ రాకేశ్‌ తివారీ తెలిపారు. సుల్తాన్‌షాహీ శ్రీ జగదాంబ ఆలయంలో ఈ రోజు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాకేశ్‌ తివారీ మాట్లాడుతూ పాత నగరంలో జూలై 17న ఘట స్థాపన, 24న బోనాల సమర్పణ, 25న ఘటాల ఊరేగింపు ఉంటుందని తెలిపారు. జూన్‌ 30న గోల్కొండ జగదాంబ అమ్మవారికి, జూలై 3న విజయవాడ కనకదుర్గమ్మకు, 5న బల్కంపేట ఎల్లమ్మకు, 8న జూబ్లీహిల్స్‌ పెద్దమ్మకు, 14న సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళికి, 19న చార్మినార్‌ భాగ్యలక్ష్మికి, 21న లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవార్లకు సప్త బంగారు బోనాలు సమర్పిస్తామన్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్