సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వర రావు, పినిపె విశ్వరూపు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు లు నివాళులర్పించారు. నేటి ఉదయం వారు హైదరాబాద్ చేరుకొని జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసంలో ఉన్న బౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఆరోగ్య సమస్యలతో నిన్న తెల్లవారుజామున మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు బౌతిక కాయాన్ని కాసేపట్లో మొయినాబాద్ మండలం కనకమామిడి సమీపంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ కు తరలించి అంతిమ క్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజుకు కుమారులు లేనందున అయన సోదరుని కుమారుడు ప్రభోద్ (ప్రభాస్ సోదరుడు) అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది.
Also Read : కృష్ణంరాజు తీరని కోరికలు