Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్మధ్యంతర బెయిల్ మాత్రమే: అంబటి

మధ్యంతర బెయిల్ మాత్రమే: అంబటి

మానవతా దృక్పథంతో, ఆరోగ్య కారణాల దృష్ట్యా  చంద్రబాబుకు బెయిల్ లభిస్తే న్యాయం , ధర్మం గెలిచిందని టిడిపి నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని కోరితే ప్రభుత్వం కూడా అభ్యంతర పెట్టలేదని గుర్తుంచుకోవాలన్నారు.  బెయిల్ వచ్చినంత మాత్రాన న్యాయం గెలిచినట్టు కాదని అంబటి రాంబాబు విమర్శించారు. కేవలం కంటి ఆపరేషన్ కోసమే కోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు. బాబు బెయిల్‌పై టీడీపీ శ్రేణులు, నాయకులు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని  ఎన్నికల తర్వాత ఆంధ్రాలో కూడా పీకేసే పరిస్థితి నెలకొందని  అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్