Sunday, March 15, 2026
Homeసినిమావెంకటేశ్ ను లైన్లో పెట్టేసిన అనిల్ రావిపూడి!

వెంకటేశ్ ను లైన్లో పెట్టేసిన అనిల్ రావిపూడి!

వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘ఎఫ్ 2’ .. ‘ఎఫ్ 3’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వెంకటేశ్ కామెడీ టైమింగ్ కీ .. అనిల్ రావిపూడి మార్క్ కంటెంట్ కి కరెక్టుగా కుదిరింది. అందువలన ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘ఎఫ్ 4’ ఉండే అవకాశం కూడా లేకపోలేదనే టాక్ వినిపించింది. సీక్వెల్ కాదుగానీ … మరో కంటెంట్ తో ఈ ఇద్దరూ సెట్స్ పైకి వెళ్లనున్నారనే ఒక టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ తరువాత అనిల్ రావిపూడి సినిమా చిరంజీవితో ఉంటుందనే వార్తలు షికారు చేశాయి. ఒక వైపున ‘విశ్వంభర’ చేస్తూనే మరో వైపున అనిల్ రావిపూడి ప్రాజెక్టునే చేయాలనే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నట్టుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించిన ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. అనిల్ రావిపూడి మాత్రం వెంకటేశ్ తో ముందుకు వెళ్లడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. అయితే ఇది చిరంజీవికి వినిపించిన కథేనా కాదా అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.

ఈ కంటెంట్ కూడా వెంకటేశ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాదికి సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలబెట్టాలనే ఉద్దేశంతో సన్నాహాలు మొదలెట్టారు. ఈ సంక్రాంతి వెంకటేశ్ కి హిట్ ఇవ్వలేకపోయింది. అందువలన వచ్చే సంక్రాంతికి ఆయనకి సక్సెస్ పడుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular