Saturday, June 29, 2024
HomeTrending Newsశవ రాజకీయాలు వైసీపీకి అలవాటే: చంద్రబాబు

శవ రాజకీయాలు వైసీపీకి అలవాటే: చంద్రబాబు

వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచొద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని…. అప్పటినుంచి సీఎం జగన్ మళ్ళీ శవ రాజకీయాలు మొదలు పెట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వృద్ధుల మరణాలను రాజకీయం కోసం వాడుకుంటున్నారని అసలు వైసీపీ డిఎన్ఏ లోనే శవ రాజకీయం ఉందని తీవ్రంగా విమర్శించారు ప్రజాగళం యాత్రలో భాగంగా కొవ్వూరు, గోపాలపురంలో జరిగిన బహిరంగసభల్లో  చంద్రబాబు ప్రసంగించారు. సచివాలయ ఉద్యోగులు లక్షా 35 వేల మంది ఉన్నారని…వారు ఒక్కొక్కరు 45 మందికి పెన్షన్ ఇచ్చినా ఒక్కరోజులో మొత్తం పంపిణీ పూర్తవుతుందని…  కానీ ఉద్దేశపూర్వకంగానే లబ్ధిదారులను సచివాలయం వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం నీచమైన రాజకీయమని దయ్యబట్టారు. ఇప్పుడు జగన్ పింఛన్ ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే 4000 రూపాయలు ఇస్తానని తాము చెప్పిన వెంటనే స్పందించి హడావుడిగా డబ్బులు పంపిణీ చేయించారని పేర్కొన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదటగా ముందుకు వచ్చిన  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.  కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని… ఏపీ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తావని బాబు భరోసా ఇచ్చారు. తమ సభలకు వస్తున్న యువత, ఆడబిడ్డలు, తెలుగు తమ్ముళ్ల హుషారు చూస్తుంటే భారీ మెజారిటీతో తాము ఘనవిజయం సాధిస్తామన్న నమ్మకం వచ్చిందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

జగన్ సభలకు 500 బస్సులు పెట్టి అద్దె మనుషులను తీసుకువచ్చినా సరే.. మీటింగ్ ప్రారంభం కాగానే పారిపోతున్నారని కానీ తమ సభలకు మాత్రం ఉత్సాహంతో పాల్గొంటూ చివరి వరకు ఉంటున్నారని…. పోలింగ్ తేదీ మే 13 ఎప్పుడు వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారని బాబు వ్యాఖ్యానించారు.ఎన్నికలకు ఇంకా కేవలం 39 రోజులే మిగిలి ఉందని.. కార్యకర్తలు స్పీడ్ పెంచి ఫ్యానును తుక్కుతుక్కు చేసి డస్ట్ బిన్లే వేయాలని విజ్ఞప్తి చేశారు మే 13న కూటమికి రెండు బటన్లు నొక్కాలని ఉత్తుత్తి బొట్టని నొక్కే జగన్ ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్