Sunday, January 19, 2025
HomeసినిమాMahesh Babu: మరోసారి వార్తల్లోకి మహేష్, రాజమౌళి మూవీ

Mahesh Babu: మరోసారి వార్తల్లోకి మహేష్, రాజమౌళి మూవీ

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనుందనే విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. డిసెంబర్ నుంచి ఈ మూవీ కోసం వర్క్ షాపు స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ కథను రెడీ చేసే పనిలో ఉన్నారు. అయితే… ఈ మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈమధ్య ఈ సినిమా గురించి మరింతగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఇటీవల విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ ఇంకా పూర్తి కాలేదని.. ఇంకా ఎవర్నీ కాంటాక్ట్ చేయలేదని చెప్పారు. అయితే.. హాలీవుడ్ స్టార్స్ నటించే ఛాన్స్ ఉందని మాత్రం చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం జక్కన్న టీమ్ సోనాల్ చౌహాన్ ని కాంటాక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతో నిజంగా సోనాల్ చౌహాన్ మహేష్‌, జక్కన్న మూవీలో ఛాన్స్ దక్కించుకుందా అని ఆరా తీస్తున్నారు. అయితే.. జక్కన్న టీమ్ మాత్రం ఇంకా కథ పూర్తి కాలేదని… స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత నటీనటులు ఎవరు అనేది ఫైనల్ చేస్తామన్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళికి హాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో మహేష్‌ బాబుతో చేయనున్న మూవీని పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే బడ్జెట్ కూడా ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీకి పెట్టనంత బడ్జెట్ పెట్టాలి అనుకుంటున్నారట. అందుకనే దుర్గా ఆర్ట్స్ తో పాటు మరో భారీ నిర్మాణ సంస్థ కూడా కలిసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ లో లేదా జనవరిలో అఫిషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్