Thursday, April 3, 2025
Homeసినిమామరోసారి చిరు ద్విపాత్రాభినయం

మరోసారి చిరు ద్విపాత్రాభినయం

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రంలో చిరంజీవి రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారని తెలిసింది. తండ్రీకొడుకుల పాత్రలు చిరు పోషిస్తున్నట్లు  వార్తలు వస్తున్నాయి.

ఇటీవల బాబీ ఫుల్ స్ర్కిప్ట్ వినిపించాడని.. కొన్ని మార్పులు చేర్పులుతో చిరంజీవి ఓకే చేశారని తెలిసింది. ఆచార్య తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే బాబీ సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మెహర్ రమేష్ తో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉంది. బాబీ, మెహర్ రమేష్ లతో చేయనున్న సినిమాలను ఓకేసారి స్టార్ట్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్