Sunday, September 8, 2024
HomeTrending NewsChelluboyina: వారి సేవలు సవాలుతో కూడినవి: మంత్రి కితాబు

Chelluboyina: వారి సేవలు సవాలుతో కూడినవి: మంత్రి కితాబు

ఆయన రాష్ట్ర మంత్రి. ఆయన్ను చూస్తే అధికార దర్పం ఏమాత్రం కనిపించదు, సామాన్యుడిలా అందరిలోనూ కలిసిపోతుంటారు. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉండే ఆయనకు తెలుగు భాష, సాహిత్యం అంటే అమితమైన మమకారం. ఆయన తెలుగులో మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది… ఆయనే  రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార-పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. సాధారణంగా రాజకీయ నేతలు ఏమాత్రం ఖాళీ దొరికినా విహార యాత్రలకు వెళుతుంటారు. కానీ ఈయన మాత్రం తన సొంత నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్నీ చుట్టివచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తారు. రామచంద్రాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చెల్లుబోయిన తన ప్రాంతాన్ని క్లీన్ గా ఉంచేందుకు అనేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టారు. ఓ ఉదయం పూట ఎలాంటి ఆర్భాటం లేకుండా ‘గుడ్ మార్నింగ్ రామచంద్రాపురం’ అంటూ బైక్ మీద కలియ తిరుగుతూ ప్రజల్లో అవగాహన కలిగిస్తుంటారు.

పారిశుధ్య కార్మికులంటే చెల్లుబోయినకు అమితమైన అభిమానం. వారు ఈ సమాజానికి తొలి వైద్యులనేది ఆయన స్పష్టమైన అభిప్రాయం. ఎప్పుడు ఖాళీ దొరికినా వారితో కాసేపు ముచ్చటించడం, వారితో కలిసి తానూ పని చేయడం… పండుగలు, పబ్బాలకు వారికి ఆత్మీయ సత్కారాలు చేయడం, వారి సేవలను ప్రస్తుతించడం ఆయనకు అలవాటు. కరోనా సమయంలో వారు చేసిన సేవలను ఎప్పుడు వీలు దొరికినా ప్రస్తుతిస్తుంటారు. ఇటీవలే ‘క్లీన్ అండ్ గ్రీన్’ పేరిట తన అసెంబ్లీ పరిధిలోని 73 గ్రామాల్లో రెండ్రోజుల పాటు ఓ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు.

వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర, తన శాఖల పనుల్లో బిజీగా ఉన్నాకూడా పారిశుధ్య కార్మికులకు మరోసారి ఆయన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.నవంబర్ 7న మంగళవారం వారికి భోజనాలు ఏర్పాటు చేసి, స్వయంగా వడ్డించడమే కాకుండా వారు తిన్న ప్లేట్లను కూడా తానే ఎత్తి శుభ్రం చేశారు. దీపావళి సందర్భంగా వారికి నూతన వస్త్రాలు బహూకరించారు.

 ప్రజారోగ్యం కాపాడడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర అమూల్యమైనదని, వారు తమ ప్రనానాలు పణంగా పెట్టి సమాజం కోసం పని చేస్తుంటారని కొనియాడిన మంత్రి… తడి-పొడి చెత్తను వేరు చేయడం ద్వారా ప్రజలు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకోసం పని చేసే ఉద్యోగులు, నేతల్లో అత్యంత సవాలుతో కూడిన సేవ వీరిదేనని ప్రస్తుతించారు. మంత్రి తమకు ఇస్తున్న గౌరవంపై పారిశుధ్య కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్