Saturday, March 14, 2026
HomeసినిమాShow Again: 'మంగళవారం' .. భయానికి పాయల్ రొమాంటిక్ టచ్! 

Show Again: ‘మంగళవారం’ .. భయానికి పాయల్ రొమాంటిక్ టచ్! 

టాలీవుడ్ పొడగరి భామల జాబితాలో పాయల్ రాజ్ పుత్ ఒకరుగా కనిపిస్తుంది. హాట్ లుక్స్ తో కుర్రకారును ఆకట్టుకోవడం .. మత్తెక్కించే చూపులతో కట్టిపడేయడం పాయల్ కి బాగా తెలుసు. అందువలన ఆమె చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా, ఆ సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నా ఆమెకి ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. గ్లామర్ ఒలకబోసే విషయంలో తనకి పెద్దగా మొహమాటాలు లేవనే విషయాన్ని ‘RX 100’ సినిమాతోనే పాయల్ నిరూపించింది. ఆ సినిమాతోనే చాలామంది ఆమె అభిమానులుగా మారిపోయారు.

ఆ సినిమా నుంచి ఆ తరహా పాత్రలు పాయల్ కి చాలానే వచ్చాయి.  అయితే ఆశించిన స్థాయిలో ఆమె విజయాలను అందుకోలేకపోయింది. గ్లామర్ పరంగా మాత్రం తనకి రావలసిన మార్కులు తెచ్చేసుకుని, కెరియర్ ను నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ సినిమా చేసింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ మధ్య కాలంలో పాయల్ చేసిన పెద్ద సినిమాగా దీనిని గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోను ఆమె పాత్ర రొమాంటిక్ టచ్ తో ఉండటం విశేషం.

ఈ కథ గ్రామీణ నేపథ్యంలో ..  సైకలాజికల్ థ్రిల్లర్ గా నడుస్తుంది. ప్రతి ‘మంగళవారం’ ఆ గ్రామంలో ఎవరో ఒకరు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. అందుకు కారణం ఏమిటనేది సస్పెన్స్. కామాన్ని అదుపు చేసుకోలేని పాత్రలో పాయల్ కనిపించనుంది. ఆ పాత్ర ద్వారా ఇచ్చే రొమాంటిక్ టచ్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత పాయల్ జోరు మరింత పెరగడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular