Sunday, January 19, 2025
HomeTrending Newsఅందుకే పార్టీ మారాను: కన్నా

అందుకే పార్టీ మారాను: కన్నా

ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన సిఎం జగన్ అవినీతిని కేంద్రీకృతం చేసి వ్యాపారం చేసుకుంటున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కన్నా అంటే బాబుకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిగా అందరికీ తెలుసనీ, తానుఎందుకు టిడిపిలో చేరుతున్నాననే అనుమానం అందరికీ వచ్చిందని,  కానీ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని, ఈ రాక్షస క్రీడను ఆపాలంటే అందరూ కలిసి రావాలని, అందుకే తానూ తెలుగుదేశం పార్టీలో చేరానని వెల్లడించారు. మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీలో చేరిన అనంతరం కన్నా ప్రసంగించారు.

ఇప్పటికి 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన సిఎం జగన్… తానేదో తన సొంత సొమ్ము సంక్షేమానికి ఇస్తున్నట్లు చెబుతున్నారని విమర్శించారు.  సిఎం జగన్ చేస్తోన్న విధ్వంస పాలన చేసున్నారని, అమరావతి రాజధానిపై మాట తప్పి మూడు రాజధానులంటూ మాట మార్చారని.. ఈ పరిస్థితుల్లో రాష్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే తాను టిడిపిలో చేరానని వివరించారు. ప్రపంచం అంటా నరేంద్ర మోడీ నాయకత్వంపైవు చూస్తోందని, కానీ అలాంటి పార్టీ నుంచి రాజీనామా చేసి టిడిపిలో చేరాలని, రాష్ట్రాన్ని ఈ పాలన నుంచి రక్షించుకునేందుకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్