Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్భాష పరిధి పెంచడం కోసమే : మంత్రి సురేష్

భాష పరిధి పెంచడం కోసమే : మంత్రి సురేష్

తెలుగు భాషాభివృద్ది పరిధిని పెంచడం కోసమే  తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మార్చామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జీవో  31 జీవోపై క్యాబినెట్ లో చర్చ జరిగిందని చెప్పారు. మాతృభాషపై పరిశోధన, అభివృద్ధి చేయాలనే సంస్కృతి భాష ను కూడా జోడించామన్నారు. భారతీయ భాషలకు మూలం సంస్కృతం అని వెల్లడించారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి తో కలిసి మీడియాతో మాట్లాడారు.

తెలుగు భాష పై మొసలి కన్నీరు కారుస్తున్న కొదరు ప్రముఖులు జీవో ను కొన్ని పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలుగు అకాడమీ టీడీపీ స్థాపించిందని చంద్రబాబు మాట్లాడటం విడ్డురంగా ఉందని, 1968 లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో అకాడమీ ప్రారంభమైందని సురేష్ గుర్తు చేశారు.  చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిరత కోల్పోయిందన్నారు. మాతృభాషను కాపాడుతూ ఇంగ్లీష్ బోధన ను ప్రవేశపెట్టామని,  40లక్షల మంది విద్యార్థులకు తెలుగు నిఘంటిక ను పంపిణీ చేశామని వివరించారు.

సంస్కృతం తో కూడిన తెలుగు భాషను ప్రజలు మాట్లాడుతున్నారని….. తెలుగు,సంస్కృత భాషను విడదీయలేమని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి అన్నారు.  తెలుగు సంస్కృత అకాడమీ పై రాజకీయ పార్టీల నేతలు ఉత్తరాలు మీద ఉత్తరాలు రాస్తున్నారని, అయితే దీన్ని రాజకీయం చేయొద్దని సూచించారు.  తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు పై అభ్యంతరాలు ఉంటే స్పష్టంగా చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సలహాలు ఇవ్వాలి కానీ విమర్శలు చేయడం సరికాదన్నారు.  తెలుగు భాష పై చంద్రబాబు, లోకేష్ కు అసలు అవగాహన ఉందా అని ప్రశ్నించారు.  తెలుగు అకాడమీ కోసం ఎంతగానో న్యాయ పోరాటం చేశామని, తెలుగు అకాడమీ కి సంబంధించిన బై లా చదవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్