మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీపడుతున్న విషయం తెలిసిందే. చతుర్ముఖ పోటీతో మా ఎన్నికల రసవత్తరంగా మారాయి. మూడు నెలల ముందు నుంచే ఎన్నికల వేడి మొదలైంది. ఈ రోజు ప్రకాష్ రాజ్.. తన ప్యానల్ మెంబర్స్ తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ… “ఈ ఎన్నికల గురించి మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఇందులో పొలిటికల్ పార్టీలు వచ్చేసాయి. కేసీఆర్, కేటీఆర్, జగన్ ఇలా… ఎవరెవర్నో ఇందులోకి లాగుతున్నారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టాను. సిని’మా’ బిడ్డలు అనే ఈ ప్యానల్ సడన్ గా వచ్చింది కాదు. ఒక సంవత్సరం నుంచి బయట మాట్లాడకుండా అసోసియేషన్ కి మనం ఏం చేయాలి అని సీరియస్ గా ఆలోచిస్తున్నాం. దాదాపు మూడు సంవత్సరాలుగా చూస్తునే ఉన్నాం. ఏం జరుగుతుందో..? సున్నిత మైన కళకారుల ఉన్న అసోసియేషన్ ఎందుకు అందరికీ ఎంటర్ టైన్మెంట్ అయిపోయింది అని ఆలోచించాను. ఇది పొలిటికల్ పార్టీ కాదు’ అని స్పష్టం చేశారు.
“ఎలాంటి వారు ఈ ప్యానల్ లో ఉండాలి. చిత్తశుధ్దితో వర్క్ చేయాలి అని గ్రౌండ్ వర్క్ చేశాం. ఇక్కడ ఒకరికొకరు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వాళ్లే ఉన్నారు. ఆ ఫ్యామిలీ అంటా.. ఈ ఫ్యామిలీ అంటా అని హెడ్డింగులు పెట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దీనికి పెద్ద పోరుగా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. గతంలో ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ల వల్ల అవ్వలేదు అంటే మనం ఏం చేయాలి..? ఎలా చేయాలి..? అని రావాలి అంతే తప్పితే విమర్శకూడదు. ఇది పదవి కోసం కాదు. ఇంటర్నల్ మేటర్. నేను తేడా చేస్తే నన్ను బయటకు పంపించే ప్యానల్ ఇది. దీనిలోకి చిరంజీవిని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. అందరూ కలిసే ఉంటారు కదా” అని అన్నారు.
“ఎవరు ఫోన్ చేసినా భయం వేస్తుంది. ఎవరి తరుపున మాట్లాడాలి..? అని…ఒక సున్నితమైన కళాకారుల అసోసియేషన్.. సినిమా అనేదే భాష. కళకారలు అనేది యూనివర్శల్. విలేజ్ దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. ఇప్పుడు నాన్ లోకల్ అనేది ఎందుకు వచ్చింది.? ఆస్ట్రేలియా, అమెరికా ఎక్కడకి వెళ్లినా తెలుగువారికి గౌరవం ఇస్తున్నారు. కోపంతో పుట్టిన ప్యానల్ కాదు ఆవేదనతో పుట్టిన ప్యానల్ ఇది. అర్హతను చూడండి. ప్రణాళికలు తయారు చేస్తాం. పేరు పేరున ఇస్తాం. మా ఇల్లును అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తాం. ఎన్నికల్లోకి వచ్చింది.. పాపులర్ అవ్వడానికి కాదు..మేము ఆల్రెడీ పాపులర్. అకారణంగా శత్రుత్వం వద్దు అనుకుంటున్నాం. పదవి కోసం ఎవరూ రాలేదు. నేను చాలా అదృష్టవంతుడిని. నాకు ప్రశ్నించేవాడు కావాలి. అలాంటి వాళ్లే మా ప్యానల్ లో ఉన్నారు” అని ప్రకాష్ రాజ్ చెప్పారు.