Saturday, November 23, 2024
HomeTrending NewsTDP-JanaSena: అస్థిరతకు గురైన ఏపీకి సుస్థిరత

TDP-JanaSena: అస్థిరతకు గురైన ఏపీకి సుస్థిరత

సాంకేతిక అంశాల సాకుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెయిల్ రాకుండా జగన్ ప్రభుత్వం అడ్డుకుంటోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చేశారు. జగన్ అరాచక పాలనతో అస్థిరతకు గురైన ఆంధ్ర ప్రదేశ్ కు సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామంటూ మండడం సభలో తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటి వరకూ పని చేస్తున్నామని చెప్పారు. రాజమండ్రి మంజీరా హోటల్ లో తెలుగుదేశం- జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) సమావేశం జరిగింది. అనంతరం పవన్ కళ్యాణ్-లోకేష్ లు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన ముఖ్యాంశాలు:

  • మూడేళ్లు నుఃడి టిడిపి జనసేన కలయిక కోసం జనం ఎదురుచూస్తున్నారు
  • అరాచక విధానాలు, పాలసీ టెర్రరిజం ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది
  • వైఎస్ఆర్సిపి దాడి చేయని పార్టీ అంటూ లేదు
  • విజయనగరం జిల్లాలో కూడా కత్తులతో పొడిచారు
  • జనసేన, టిడిపి ,సీపీఎం పార్టీలను ఇబ్బంది పెట్టారు
  • అచ్చేన్నాయుడు నుంఛి చంద్రబాబువరకు అక్రమ కేసులు, అరాచకాలు ఆగలేదు
  • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే జనసేనతో ప్రథమం
  • వైయస్సార్సీపీకి మేము వ్యతిరేకం కాదు వారి విధానాలకు వ్యతిరేకం
  • కల్తి మందు, సరఫరా, ఇసుక , ఖనిజాలు దోపిడీ చేశారు
  • 30 వేల కోట్లు మద్యంపై సంపాదించారు. ఇసుక దోపిడీ చేస్తున్నారు.
  • సిపిఎస్ రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేశారు
  • వైసీపీ అనే తెగులు రాష్ట్రానికి పట్టుకుంది, టీడీపీ జనసేన కలయికే దీనికి మందు
  • రాజమండ్రిలో ఇదొక చారిత్రాత్మక సమావేశం
  • 75 ఏళ్ల సీనియర్ నాయకుడిని జైల్లో పెట్టారు.బయలు రాకుండా టెక్నికల్ ఇష్యూస్ చూపిస్తున్నారు
  • చంద్రబాబుకు ధైర్యం ఇచ్చేలా చారిత్రక రాజమండ్రిలో ఈ కార్యక్రమం పెట్టాం
  • రాష్ట్ర భవిష్యత్తు భరోసా ఇవ్వటానికి ఈ కార్యక్రమం నిర్వహించాము
  • సమావేశంలో మేనిఫెస్టో గురించి చర్చించాం. యనమల, నాదెండ్ల లోతుగా చర్చలు జరిపారు
  • ఈ కార్యక్రమం లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇవ్వటం
  • మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉమ్మడి పార్టీల తరఫున ఉండాలన్న అంశం కూడా చర్చకు వచ్చింది
  • మా మధ్య గొడవలు రావు, మేం కొట్టుకోము
  • ఉమ్మడి కార్యాచరణపై  మరో వారం పది రోజుల్లో స్పష్టత ఇస్తాం
  • ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చిత్రమైన పరిస్థితి
  • జనసేన ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే.
  • అభివృద్ధి, సంక్షేమ జోడెద్దుల బండి…. దానిని ముందుకు తీసుకెళ్తాం
  • తప్పులు చేసి కాదు.. అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం

లోకేష్ మాట్లాడుతూ …

  • జనసేన టిడిపి కలయిక రాష్ట్రానికి మేలు చేస్తుంది
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే రెండు పార్టీలు కలసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి
  • బీసీలకు రావలసిన అనేక పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది
  • దళితులను వెంటాడి చంపేస్తుంది, దళితులకు సంబంధించి 25 కార్యక్రమాలు రద్దు చేసింది
  • ప్రభుత్వ వేధింపులతో మైనారిటీ కుటుంబం ఆత్మహత్య కు పాల్పడింది
  • 34 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది …మిగులు జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి
  • రాష్ట్రానికి గడచిన నాలుగేళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు
  • గతంలో అచ్చం నాయుడు గారిని వేధించారు
  • ఏ తప్పు చేయకపోయినా బాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి 44 రోజులు రిమాండ్ ఉంచారు
  • 29,30,31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల వారీగా జనసేన-తెలుగుదేశం సమన్వయ కమిటీల సమావేశాలు
  • నవంబర్ 1 నుండి మేనిఫెస్టో రూపొందించుకుని ప్రచారం నిర్వహిస్తాం
  • ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశాం
  • చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ మొదటి తీర్మానం
  • అరాచక పాలన గురించి రాష్ట్రాన్ని కాపాడేందుకే పొత్తు నిర్ణయం పై రెండో తీర్మానం
  • రెండు పార్టీలు కలయికతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి  పథంలో తీసుకు వెళ్చెంళడం మూడోడి
  • కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తాం
  • రానున్న జేఏసీలో ఉమ్మడిగా ఏ రకంగా ముందుకెళ్లాలనేదానిపై చర్చిస్తాం
  • రాష్ట్ర భవిష్యత్తుకోసం కలిసి పనిచేయాలని నిర్ణయం జరిగింది. పదవుల గురించి తర్వాత ఆలోచిస్తాం
  • కార్యకర్తలు కూడా కలసి పనిచేయటానికి ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్