Saturday, January 18, 2025
Homeసినిమామా బ్రతుకుతెరువును బ్రతికించండి: రాజశేఖర్ 

మా బ్రతుకుతెరువును బ్రతికించండి: రాజశేఖర్ 

Make it success: రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో ‘శేఖర్‘ సినిమా రూపొందింది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించారు. ఈ వేదికపై రాజశేఖర్ మాట్లాడుతూ ..  మీ అందరి ప్రార్ధనలు ఫలించి కోవిడ్ నుంచి నేను కోలుకున్న తరువాత చేసిన సినిమా ఇది. నా కంటే ఎక్కువగా ఈ సినిమా కోసం జీవిత కష్టపడింది. తనకి పిల్లలిద్దరూ చాలా హెల్ప్ చేశారు. మీరంతా ఈ సినిమాను చూడాలి. అందరూ ఈ సినిమాను చూసి మా బ్రతుకు తెరువును బ్రతికించండి” అని అన్నారు.

జీవిత మాట్లాడుతూ .. “అందరూ కూడా జీవిత ఐరన్ లేడీ అనుకుంటారు .. నేను పడిన కష్టాలు నన్ను అలా తయారు చేశాయి. నిజానికి నేను కూడా సామాన్యురాలినే. ఈ సినిమా వెనుక మా కలలు ఉన్నాయి .. కష్టాలు ఉన్నాయి. నేను ఎవరినీ ఎప్పుడూ మోసం చేయలేదు. చేతనైతే సాయం చేశానంతే. ఈ సినిమాకి టిక్కెట్ల రేటును పెంచలేదు. రేట్లు మీకు అందుకుబాటులో ఉంటాయి. అందువలన ఈ సినిమాను మీరంతా చూడాలి ..  ఇది చాలామంచి సినిమా. మీరంతా తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాము” అని చెప్పుకొచ్చారు.

ఇక ముఖ్య అతిథిగా వచ్చిన సుకుమార్ మాట్లాడుతూ .. “నేను సినిమాల్లోకి రావడానికి ముందు రాజశేఖర్ గారి అభిమానిని. మా ఊళ్లో రాజశేఖర్ గారిని అనుకరిస్తూ ఫేమస్ అయ్యాను. ఒక విధంగా చెప్పాలంటే నేను సినిమాలకి పనికి వస్తానని నేను అనుకోవడానికి కారణం రాజశేఖర్ గారే. ఇక ఈ సినిమాకి దర్శకుడిరాలిగా జీవితగారు పడుతున్న టెన్షన్స్ చూస్తూనే ఉన్నాను.  ఆమె ఈ సినిమాను ఇక్కడి వరకూ తీసుకుని రావడానికి ఏ స్థాయిలో కష్టపడి ఉంటారనేది నాకు అర్థమైంది. ఆమె కోసమైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్  కావాలని కోరుకుంటున్నాను” అని ముగించారు.

Also Read : రాజశేఖర్ భుజాలపైనే పూర్తి బాధ్యత పెట్టేసిన ‘శేఖర్’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్