Sunday, January 19, 2025
HomeTrending Newsవికేంద్రీకరణ మా విధానం: బొత్స స్పష్టం

వికేంద్రీకరణ మా విధానం: బొత్స స్పష్టం

Our stand is clear:  పరిపాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, అది తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. అమరావతి, సీఆర్డీఏపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని, సుప్రీంకోర్టుకు వెళ్ళాలా వద్ద అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  రాజధాని అంటే 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశమని, అందరి మనోభావాలకు తగ్గట్లుగా పరిపాలనా విధానం ఉండాలని చెప్పారు. రాజధాని అంటే కేవలం భూమి మాత్రమో, సామాజికవర్గం మాత్రమో కాదని బొత్స వ్యాఖ్యానించారు.  రాజధాని అంటే ప్రజలు అని, అక్కడ ఉన్న సామాజిక వర్గమో, రియల్ ఎస్టేట్ వ్యాపారమో కాదన్నారు.

రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని, ఇదే విషయాన్ని కేంద్రం ప్రభుత్వం కూడా అనేక సార్లు స్పష్టంగా చెప్పిందన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి తమ అభిమతమని, రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణ తప్పనిసరి అని తాము గట్టిగా నమ్ముతున్నామని బొత్స అన్నారు. ప్రస్తుతం సీఆర్దీయే చట్టం అమల్లోనే ఉందని, గత శాసనసభ సమావేశాల్లో తాము ఈ మేరకు బిల్లును కూడా ప్రవేశపెట్టమని గుర్తు చేశారు. పునర్విభజన చట్టంలో రాజధాని అంశంపై శివరామ కృష్ణన్ కమిటీని నిర్ణయించిందని, ఆ కమిటీ సిఫార్సులను ఎందుకు అమలు చేయలేదని, మళ్ళీ నారాయణ నేతృత్వంలో ఎందుకు కమిటీ వేయాల్సి వచ్చందని బొత్స ప్రశ్నించారు.

మాస్టర్ ప్లాన్ ను ఆరునెలల్లోగా అభివృద్ధి చేయాలని న్యాయస్థానం చెప్పిందని, అయితే దానికి కావాల్సిన ఆర్ధిక వనరులపై కూడా ఆలోచించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమయం, ఖర్చు, దానికి కావాల్సిన నిధులు లాంటి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. హైకోర్టులో దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది అభిప్రాయాలు ఖచ్చితంగా తీసుకుంటామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్