ప్రతిపక్ష నేత చంద్రబాబు, అయన తనయుడు లోకేష్ లకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావడం లేదని విమర్శలు చేస్తారని, సిఎం జగన్ పరిశ్రమలను పారంభిస్తే అవి తమ వల్లే వచ్చాయని చెబుతున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా అనతరం మీడియాతో మాట్లాడారు.
అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పరిశ్రమలు పెడుతుంటే కళ్ళు కనబడడం లేదని, వారు ఎక్కడైనా ఐ హాస్పటల్ లో చూపించుకోవాలని సూచించారు. సిఎం జగన్ ను చూసి అందరూ పారిపోతున్నారని, అసలు పరిశ్రమలే రావడం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వీరి మాటలన్నీ పరస్పర విరుద్ధంగా ఉంటాయన్నారు. తమ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తోందని, పరిశ్రమలు రాకపోతే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడో ఏడాది కూడా మొదటి స్థానంలో ఎలా వస్తామని ప్రశించారు.
మరొక్క అవకాశం కల్పించాలని చంద్రబాబు ప్రజలను వేడుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. వైసీపీపై బురద జల్లి రాజకీయం చేస్తున్నారు తప్ప, ప్రజల్లో నమ్మకం కలిగించుకోవడంలో టిడిపి నేతలు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజకీయాలే చేస్తే భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీగా కూడా ఉండలేరన్నారు.
Also Read: మంచి చేశాం కాబట్టే ధైర్యం: రోజా