Thursday, March 12, 2026
HomeTrending NewsTDP: మాది విజన్, వారిది ప్రిజన్ డాక్యుమెంట్: బొండా ఉమా

TDP: మాది విజన్, వారిది ప్రిజన్ డాక్యుమెంట్: బొండా ఉమా

తెలుగుదేశం పార్టీది విజన్ డాక్యుమెంట్ అయితే, వైసీపీది ప్రిజన్ డాక్యుమెంట్ అని టిడిపి నేత బొండా ఉమా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలనే విజన్  తమదని, ఎంతమంది విపక్ష నేతలను జైళ్ళలో పెట్టాలనేది వారి ఆలోచన అని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడో విజన్ 2020 డాక్యుమెంట్ ఇచ్చారని, అప్పట్లో విమర్శించిన వారు ఆయన దూరదృష్టి ఏమిటో ఇప్పుడు అర్ధం చేసుకున్నారని, అలాగే నిన్న విశాఖలో  2047 విజన్ డాక్యుమెంట్ ఇచ్చారని, దీనిపై వైసీపీ చేస్తున్న విమర్శలు సహేతుకం కాదన్నారు.

నాలుగేళ్ళలో పది లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.  తాగుబోతుల జేబులు కొట్టి ఆదాయం సంపాదించుకుంటున్న వైసీపీకి తమను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు.  ప్రజాక్షేత్రంలో వైసీపీ అక్రమాలను ఎండగడతామని, వారి సంగతి ప్రజా కోర్టులోనే తేలుస్తామని హెచ్చరించారు. వైసీపీ నేతలు శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం కొల్లగొడుతున్నారని, అందుకే చిరుతలు రోడ్లపైకి వస్తున్నాయని బొండా అన్నారు. భక్తులకు సమాధానం చెప్పలేకే కర్రలు ఇస్తామని చెబుతున్నారని అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular