Monday, January 20, 2025
HomeTrending Newsవిద్యను ప్రోత్సహించెందుకే ఆ నియమం: సిఎం

విద్యను ప్రోత్సహించెందుకే ఆ నియమం: సిఎం

మైనార్టీ విద్యకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఓ వైపు ఉర్దూ నేర్పిస్తూనే మరోవైపు ప్రపంచంలో పోటీని తట్టుకునేలా ఇంగ్లీష్ విద్య కూడా అందిస్తున్నామని చెప్పారు. విద్యను ప్రోత్సహించేందుకే షాదీ తోఫాలో పదో తరగతిని కనీస విద్యార్హతగా నిర్ణయించామని, దీన్ని అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ముస్లిం చెల్లి, తమ్ముడు తప్పకుండా చదవాలని హితవు పలికారు. ప్రపంచంలో గెలావాలి అంటే తప్పకుండా వారు చదవాల్సిందేనన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన మైనార్టీ డే ఉత్సవంలో సిఎం పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ… మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా వెనకాడిన గత ప్రభుత్వ హయాం నుంచి… తమ హయాంలో ఓ మైనార్టీని డిప్యూటీ సిఎంగా చేసుకున్నామని,  తమ పార్టీలో నలుగురు మైనార్టీలు ఎమ్మెల్యేలుగా ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా చేశామని వెల్లడించారు.  మైనార్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చిన ఘనత దివంగత నేత డా. వైఎస్సార్ కే దక్కుతుందన్నారు. మైనార్టీ సంక్షేమం విషయంలో వైఎస్ రెండు అడుగులు వేస్తే తాను నాలుగు అడుగులు వేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా  జాతీయ విద్యా దినోత్సవం, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. దేశానికి తొలి విద్యా శాఖ మంత్రిగా అయన చేసిన సేవలు నిరుపమానమని పేర్కొన్నారు. మైనార్టీలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని, మీ అందరి దీవెనలు తమకు ఉండాలని కోరారు. ఈ ప్రభుత్వం మీది అని, అన్ని రకాలుగా అండగా ఉంటానని సిఎం భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం అంజాద్ భాషా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్