Sunday, January 19, 2025
Homeసినిమాఈసారి ‘ప‌క్కా...’  అంటున్న మారుతి

ఈసారి ‘ప‌క్కా…’  అంటున్న మారుతి

Release Pakka: యాక్ష‌న్ హీరో గోపీచంద్, యూత్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’. ఈ సినిమాని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి గోపీచంద్ ను మారుతి ఎలా చూపించ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇప్పుడు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని  ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.

జులై 1వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా మారుతి ప్ర‌క‌టించారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ల పై నిర్మించిన ఈ సినిమాకి, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా రాశీ ఖన్నా అలరించనుంది. రాశి ఖన్నా తన కెరియర్ తొలినాళ్లలోనే గోపీచంద్ తో కలిసి జిల్ వంటి హిట్ మూవీ చేసింది. ఆ తరువాత ఆ మధ్య మారుతి దర్శకత్వంలో ప్రతి రోజూ పండగే అనే సినిమాలో న‌టించింది.
ఇక ఇప్పుడు ఈ ఇద్దరితోను కలిసి ప్రేక్షకుల ముందుకు రానుంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్..  ఈ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ స‌క్సెస్ అందిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు.

Also Read : ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ లో దేవకన్యలా రాశీ ఖన్నా

RELATED ARTICLES

Most Popular

న్యూస్