పల్లె ప్రగతిని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ఒక జీవన విధానంగా చూడాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా మన గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. మన గ్రామాలను మిగతా రాష్ట్రాలు, దేశం అనుసరిస్తున్నది. పల్లెల అభివృద్ధి వెలుగు విరజిమ్మతూ ఉన్నాయి. ఈ పథకం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. కేంద్రం అవార్డులు ఇవ్వటమే ఇందుకు నిదర్శనం. ప్రజలంతా భాగస్వాములై, పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని జీవన విధానంగా అలవాటు చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను, బమ్మెర గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం సిసి రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ… ప్రజలను భాగస్వాములను చేస్తూ, అభివృద్ధిని గ్రామాలకు పట్టం కడుతూ, సీఎం చేపట్టిన పల్లె ప్రగతి వల్ల మన గ్రామాల రూపు రేఖలే మారాయని చెప్పారు. పల్లె ప్రగతి తో పారిశుద్ధ్యం పెరిగింది, విష జ్వరాలు దూరమయ్యాయి. అంటురోగాలు మాయమయ్యాయి. ఆరోగ్యాలు మెరుగు పడ్డాయి. కనీస సౌకర్యాలు పెరిగి, గ్రామాలు అభివృద్ధి చెందాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి అని మంత్రి వివరించారు.
నేనూ మిషన్ భగీరథ నీటినే తాగుతా…
46 వేల కోట్లతో గోదావరి జలాలను ఇంటింటికి తాగునీరు గా అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీటిని త్రాగాలని తాను కూడా భగీరథ నీటిని తాగుతున్నాను అన్నారు.
వైకుంఠధామం అన్ని సౌకర్యాలు కల్పించాలని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటు న్న0దున ప్రజలు భాగస్వామ్యం అందించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఇల్లు తడి పొడి చెత్తను వేరు చేసి అందించాలని చెత్తను రోడ్లపై వేస్తే జరిమానా విధిస్తామని అన్నారు. సెగ్రిగేషన్ షెడ్ల ద్వారా ఎరువు తయారీ విధానాన్ని చేపట్టి పల్లె ప్రగతి లో మొక్కలకు వినియోగిస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల విక్రయం ద్వారా 400 రూపాయలు గ్రామ పంచాయతీకి ఆదాయం లభించిందని ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలకు నీళ్లు పోయడం ద్వారా 1. 30 లక్షలు ఆదాయం ఒన కూరిందన్నారు. ఒక ఎకరంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకున్నామని మరో ఎకరంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయబోతున్నాం అని తెలిపారు. గూడూరు నుండి రఘునాథపల్లి వరకు 10 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని జనగామ రహదారులు కూడా కలుపుతున్నట్లు తెలియజేశారు.
పాఠశాల అభివృద్ధికి 22 లక్షలు మంజూరు చేశామన్నారు 36 లక్షలతో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టామని మరో 65 లక్షలు సిసి రోడ్డు మంజూరు చేశామన్నారు. 20 వేల కోట్లతో ఈ ప్రాంతానికి సాగునీటిని 365 రోజులు అందిస్తున్నామని చెప్పారు.
బొమ్మెర గ్రామంలో కోటి రూపాయలతో నిర్మించనున్న సి.సి.రోడ్లకు శంఖుస్థాపన చేశారు.తదనంతరం జరిగిన పల్లెప్రగతి సభలో సర్పంచ్ నాగభూషణం అధ్యక్షతన మంత్రి మాట్లాడుతూ బొమ్మెర గొప్ప చారిత్రమకాత్మక ప్రాంతమని కవులు జన్మించిన చారిత్రాత్మక గ్రామానికి 7.30 కోట్లతో పనులు చేపట్టామని, మరో 6కోట్లు అదనంగా విడుదల చేయడం జరిగిందన్నారు. బొమ్మెర దేవాలయానికి కోటి రూపాయలు, జాఫర్ గడ్ రోడ్ కు15కోట్లు,గ్రామపంచాయతీ కి 16లక్షలు, మిషన్ భగీరథ త్రాగునీరుకు 5కోట్లు, ప్రైమరీ పాఠశాలకు 18లక్షలు, జడ్పి స్కూలుకు 40లక్షలు ఖర్చుచేసామన్నారు. బొమ్మెర నుండి తిరుమలగిరి, అయ్యగారిపల్లి రోడ్లను కూడా మంజూరు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పా గాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రాంబాబు, ఆర్డిఓ కృష్ణవేణి జడ్పిటిసి శ్రీనివాసరావు ఈరవెన్ను, బమ్మెర గ్రామసర్పంచ్ లు ముస్కు నిర్మల, కో అప్షన్ మెంబర్ మదార్, మార్కెట్ చైర్మన్ రాంబాబు, నాగభూషణం ఎంపీపి నాగిరెడ్డి, ఎంపిటిసి శారద, పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : త్వరలోనే 57 ఏళ్ల వారికి పెన్షన్లు – మంత్రి ఎర్రబెల్లి