Saturday, April 26, 2025
HomeTrending Newsఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి పూర్తి: నిరంజన్‌ రెడ్డి

ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి పూర్తి: నిరంజన్‌ రెడ్డి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఏడాదిలోగా పూర్తవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో దశాబ్దాల పాటు పక్కనపెట్టిన పెండింగ్ ప్రాజెక్టులను స్వరాష్ట్రంలో శరవేగంగా పూర్తి చేశామన్నారు. కాళేశ్వరం నిర్మాణంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయిందని చెప్పారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మార్నింగ్‌ వాక్‌లో భాగంగా తాళ్లచెరువు, లక్ష్మీకుంట పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభమయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కోనసీమను మించిపోతుందని చెప్పారు. దశాబాద్దాలుగా చెరువులు, కుంటలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. తాగునీటికి కూడా తండ్లాడే పరిస్థితిని ఎదుర్కొన్నామని చెప్పారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత రాష్ట్రంలోని నీటివనరులను ప్రభుత్వం పటిష్టపరిచిందని వెల్లడించారు. దీంతో నాడు వందల ఫీట్లు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదని.. నేడు పునాదులు తవ్వితే భూగర్భజలాలు ఎగసిపడుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ సాగునీటిరంపై దృష్టిసారించడంతోనే ఇది సాధ్యమయిందన్నారు. వనపర్తి జిల్లా కేంద్రానికి భవిష్యత్‌లో నీటి ఎద్దడి రాకుండా పట్టణం చుట్టూ చెరువులను పటిష్టం చేశామన్నారు.

Also Read : ఎనిమిదేండ్లలో అనేక అభివృద్ధి పనులు : మంత్రి నిరంజన్‌ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్