Sunday, January 19, 2025
Homeసినిమా‘పలానా ఫారెస్ట్ లో’ టైటిల్ లోగో విడుదల చేసిన సుధీర్ బాబు

‘పలానా ఫారెస్ట్ లో’ టైటిల్ లోగో విడుదల చేసిన సుధీర్ బాబు

చిన్మయి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘పలానా ఫారెస్ట్ లో’  రాయచోటి, షాన్ ఫై ఫారెస్ట్, నల్లమల అడవులు, కడప, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ ఉంటుంది. నూతన నటీనటులు నటిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు విడుదల చేశారు.

“కొత్త నటులతో  సస్పెన్స్ థిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర దర్శక నిర్మాతలకు బెస్ట్ విషెస్ తెలుపు తున్నాను. కాన్సెప్ట్ బాగున్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి అలాగే ఈ సినిమా సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా”నని తెలిపారు. దర్శకుడు అనిల్ చెన్నూరు మాట్లాడుతూ… సస్పెన్స్ తో పాటు  వినోదం మిస్ కాకుండా ప్రేక్షకులను మెప్పించే విధంగా “పలానా ఫారెస్ట్ లో” సినిమా ఉంటుందని .. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని అన్నారు.

నిర్మాత.. జల్లా ఆది శేషగిరి బాబు మాట్లాడుతూ… “సరికొత్త పాయింట్ తో తెరకెక్కుతున్న “పలానా ఫారెస్ట్ లో” సినిమాను హైదరాబాద్ రాయచోటి, షాన్ పై పారెస్టు, కడప నల్లమల అడవుల్లో అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరణ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము.. మా చిత్ర టైటిల్ లోగో ను లాంచ్  చేసినందుకు  హీరో సుధీర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, త్వరలో మా సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు వెల్లడిస్తా”మన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్