రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఏదో సీజన్ విజేతగా నిలిచాడు. స్టార్ మా టివిలో ప్రసారమయ్యే ఈ షో కు హీరో కింగ్ నాగార్జున హోస్ట్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 3 న మొదలైన ఈ సీజన్ నిన్న ఫైనల్ తో ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలే కోసం తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఏంటో ఎదురు చూశారు.
బిగ్ బాస్ సీజన్ 7టైటిల్ కోసం అర్జున్, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, ప్రియాంక పోటీ పడ్పడారు. వీరిలో పల్లవి ప్రశాంత్ కిరీటం దక్కించుకున్నాడు. ఫైనల్ కి చేరిన 6 గురిలో అత్యధిక ఓట్లు సాధించిన ప్రల్లవి ప్రశాంత్ కే బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ దక్కింది.. అయితే చివరి వరకు శివాజీ,అమర్ గట్టి పోటీ ఇవ్వగా విజయం పల్లవి నే వరించింది. తొలిసారి ఈ ఘనత సాధించిన సామాన్యుడిగా ప్రశాంత్ రికార్డ్ సృష్టించాడు. అతడికి 50 లక్షల నగదుతో పాటు మారుతి కారు మరియు 15 లక్షల విలువైన బంగారం లభించింది.
పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టాడు. హౌస్ లో వున్న వారందరితో ఎన్ని ఇబ్బందులు తలెత్తిన కూడ ప్రశాంత్ ఎప్పుడూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా అమర్ దీప్ తో హౌస్ లో ప్రశాంత్ కి సమస్యలు వస్తున్నప్పటికీ ప్రశాంత్ వీలైన మేరకు ఎంతో కూల్ గా డీల్ చేస్తూ ఎంతో చక్కగా తన గేమ్ ను ఆడాడు.. ప్రతి టాస్క్ ను ఎంతో చక్కగా పూర్తి చేసాడు.దీనితో క్రమంగా ప్రశాంత్ గురించి ఆడియన్స్ చర్చించుకుంటూ వచ్చారు.అలాగే హౌస్ శివాజీ సపోర్ట్.. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకలతో జరిగిన గొడవలు పల్లవి ప్రశాంత్ కి పాజిటివ్స్ గా మారాయి. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ పల్లవి ప్రశాంత్ కు బాగా వర్కౌట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ప్రశాంత్ హౌస్ లో మాట్లాడుతూ వచ్చాడు. దీనితో ఆడియన్స్ రైతు బిడ్డకి ఓట్లు గుద్దేశారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ వచ్చి బిగ్ బాస్ 7 టైటిల్ గెలుచుకున్నాడు..