Sunday, January 19, 2025
Homeసినిమా'ప్రాజెక్ట్ కే' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

‘ప్రాజెక్ట్ కే’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రభాస్, నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ప్రాజెక్ట్ కే‘. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ ఇంకా దిశా పటాని కూడా న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. సంక్రాంతి కానుక‌గా 2024 జ‌న‌వ‌రి 12న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

రిలీజ్ అవ్వడానికి ఇంకా 6 నెలల వరకూ టైముంది. కానీ ఇప్పటినుండే ఎదురుచూపులు మొదలయ్యాయి. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగ్ అశ్విన్ మేకింగ్.. అందులోనూ ప్రభాస్ హీరో కాబట్టి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో వినూత్నంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా యూఎస్ లో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే యూనిట్ హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. దీంతో అందరూ ఆ మూమెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ గ్యాప్ లో మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చేశారు. ప్రభాస్ ఫస్ట్ ను రిలీజ్ చేస్తున్నట్టు అప్ డేట్ ఇచ్చి క్యూరియాసిటీని మరింత పెంచేశారు. ఇక తాాజాగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఫెరోషియస్ గా ఉన్న ప్రభాస్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు షూటింగ్ మొదలైన తరువాత రెండు ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

Also Read: ప్రాజెక్ట్ కే కోసం రంగంలోకి రానా

RELATED ARTICLES

Most Popular

న్యూస్