బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో థియేటర్లలో సినిమా విడుదల కానుంది. లహరి ఆడియో ద్వారా పాటలు విడుదల కానున్నాయి. ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ… “సినిమా గురించి చెప్పేముందు మా పార్ట్నర్, ‘ఎస్ ఒరిజినల్స్’ అధినేత సృజన్ గురించి చెప్పాలి. ఈ సినిమా నిర్మాతల్లో ఆయన ఒకరు… అమెరికాలో డాన్ లాగా! మేం ఒక సినిమా చేయడానికి కష్టపడుతుంటే… సరదాగా ఆరేడు సినిమాలు లైనప్ లో పెట్టారు. మా సినిమాలో నటించిన నటీనటులు అందరికీ సారీ. మేమంతా కొత్తవాళ్ళం. చాలా ఇబ్బందులు పెట్టి, డబ్బులు కూడా కాస్త తక్కువ ఇచ్చి సినిమా చేశాం. సినిమా, రిజల్ట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. మా సహ నిర్మాత రమేష్ అంకుల్ కి థాంక్యూ” అని అన్నారు.
దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ… “ఈ సినిమా ఒక అమ్యూజ్‌మెంట్ పార్క్ లాంటిది. టికెట్ తీసుకుని అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళితే డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. అలాగే, మా సినిమాలో కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. ప్రతి అరగంటకు ప్రేక్షకుల్ని కొత్త రైడ్ కి తీసుకువెళతాం. నేను కథ రాయడం ప్రారంభించిన తర్వాత నాకు అండగా నా వెనుక ఉన్నది మా నిర్మాత అఖిలేష్. మా ఇద్దరికీ ఇది తొలి సినిమా. ఎటువంటి డౌట్స్ లేకుండా షూటింగ్ కు వెళ్లాం. స్క్రిప్ట్ ఫినిష్ అయ్యాక… మా చేతిలో ఓ బంగారు ఆభరణం మా చేతిలో ఉన్నట్టు ఉంది. దానికి డైమండ్ సెట్స్ కావాలి. ఆ డైమండ్స్ మా సినిమాలో నటించిన యాక్టర్స్. అందరూ ఫెంటాస్టిక్ పీపుల్. నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి సహకరించిన టెక్నికల్ టీమ్ కి థాంక్స్. మేం అడిగిన వెంటనే టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన సత్యదేవ్ గారికి థాంక్స్. త్వరలో థియేటర్లలో మా సినిమా విడుదల కాబోతుంది” అని అన్నారు.
రాహుల్ విజయ్ మాట్లాడుతూ “మా టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సత్యదేవ్ గారికి థాంక్యూ. మేం కూడా! అనగనగా ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్లు, టెక్నీషియన్లు మా పనులు మేం చేసుకుంటూ ఉంటే… ఒక కొత్త జీవనాధారం కోసం ‘పంచతంత్రం’ అని ఒక సినిమా చేశాం. ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. హర్ష ఈ సినిమా కథ రాసినప్పుడు… ప్రేక్షకుల వరకూ రావడం కోసం మేమంతా ఓ సాయం చేశాం. నేను చేసినది ఉడతా సాయమే. అఖిలేష్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి… సాయం అంటే కొడతాడేమో!” అని అన్నారు.
శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ “బ్రహ్మానందం గారు, స్వాతి గారు, సముద్రఖని గారు లాంటి నటీనటులతో పని చేయడం సంతోషంగా ఉంది. స్నేహితులతో వెళ్లి సినిమా చూసివచ్చినట్లు అనిపించింది. ఆదర్శ్ అన్నయ్యతో నా రెండో సినిమా ఇది. ఆయనతో ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘దొరసాని’ తర్వాత తెలుగులో నా రెండో సినిమా ‘పంచతంత్రం’. రెండిటికీ ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా రాహుల్ విజయ్, ఇతర నటీనటుల్ని కలవడం సంతోషంగా ఉంది” అని అన్నారు.