Friday, March 13, 2026
Homeసినిమాఅది నాకు లైఫ్ టైం గిఫ్ట్ : ప‌ర‌శురామ్.

అది నాకు లైఫ్ టైం గిఫ్ట్ : ప‌ర‌శురామ్.

Great gift: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్లో రూపొందిన  చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. టాక్ తో సంబంధం లేకుండా రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ దూసుకెళుతోంది. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ వేడుక‌లో పరశురామ్ మాట్లాడుతూ “మహేష్ బాబు గారి ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన్ని దర్శకత్వం వహించి, సినిమా విజయోత్సవం కర్నూల్ లో జరుపుకోవడం అనేది నాకు లైఫ్ టైం గిఫ్ట్.  మహేష్ బాబుగారికి థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట. మహేష్ గారిని ఎంత ప్రేమిస్తానో మాటల్లో చెప్పలేను. ఆయనకు మంచి సినిమా ఇస్తానని మాటిచ్చాను. ఆ మాట సర్కారు వారి పాటతో నిలబెట్టుకోవడం చాలా ఆనందంగా వుంది”

“సంగీత దర్శకుడు తమన్, డీవోపీ మధి, ఎడిటర్ మార్తండ కే వెంకటేష్, అనంత్ శ్రీరాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ టీం చందు, రాజు,శేఖర్ .. అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. సర్కారు వారి పాట ని ఇంత స్థాయిలో తీర్చిదిద్దిన నిర్మాతలు నవీన్ గారు, రవి గారు, గోపి గారు, రామ్ గారు, జీఏంబీ ఎంటర్టైన్మెంట్ తరపున నమ్రతగారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమాని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular