Sunday, January 19, 2025
Homeసినిమాపరశురామ్ మరో హీరోతో ప్లాన్ చేస్తున్నాడా..?

పరశురామ్ మరో హీరోతో ప్లాన్ చేస్తున్నాడా..?

పరశురామ్, మహేష్‌ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత నాగచైతన్యతో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. కొన్ని కారణాల వలన కుదరలేదు. ఎవరితో సినిమా చేస్తాడనుకుంటే.. విజయ్ దేవరకొండతో సినిమాని ప్రకటించాడు. వీరిద్దరి కాంబినేషన్లో ‘గీత గోవిందం’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అప్పటి నుంచి కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. ఇన్నాళ్లకి ఇలా సెట్ అయ్యింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించాలి అనుకున్నారు.

అయితే.. ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో ప్రకటించి అల్లు అరవింద్ కి షాక్ ఇచ్చారు దిల్ రాజు, పరశురామ్. ఆతర్వాత అది వివాదస్పద అవ్వడం.. అల్లు అరవింద్ ఆగ్రహాం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి అంతా సెట్ అయ్యింది. ఈ సినిమా సెట్స్ పైకి రాకుండానే పరశురామ్ మరో హీరోతో మూవీ కూడా కన్ ఫర్మ్ చేసుకున్నాడని తెలిసింది. ఇంతకీ ఎవరా హీరో అంటే.. కోలీవుడ్ స్టార్ కార్తీ అని సమాచారం. కార్తీకి తెలుగు సినిమాల పై ఎప్పటి నుంచో దృష్టి ఉంది. ఆ దిశగా ఫోకస్‌ కూడా పెట్టాడు. నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.

ఇప్పుడు మళ్లీ తెలుగులో డైరెక్ట్‌ మూవీ చేయాలి అనుకుంటున్నాడు. అందుకనే కొన్ని కథలు విన్నాడు కానీ.. ఏదీ వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు పరశురామ్‌ కథ కార్తీకి బాగా నచ్చిందని తెలుస్తోంది. అయితే.. పరశురామ్‌ మొదట విజయ్‌ దేవరకొండ సినిమా పూర్తి చేస్తాడని సమాచారం. అంతా ఓకే అయితే ఈ సినిమా తర్వాతే కార్తీ సినిమా ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. మరి.. కార్తీని పరశురామ్ ఎలా చూపిస్తాడో..? ఈ సినిమాను ఏ బ్యానర్ లో చేస్తాడో.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్