Sunday, February 23, 2025
HomeTrending Newsదిశ పిఎస్ కు పార్లమెంట్ కమిటీ ప్రసంశ

దిశ పిఎస్ కు పార్లమెంట్ కమిటీ ప్రసంశ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీసు స్టేషన్ల పనితీరు అద్భుతంగా ఉందని పార్లమెంట్ మహిళా భద్రత కమిటీ ప్రశంసించింది. పార్లమెంట్ సభ్యుల బృందం నేడు శనివారం విశాఖపట్నంలోని దిశ పోలీసు స్టేషన్ ను సందర్శించింది. బిజెపి ఎంపీ డాక్టర్ హీనా విజయ్ కుమార్ గవిట్ అధ్యక్షతన 7 మందితో కూడిన సభ్యులు ఈ  బృందంలో ఉన్నారు. దిశ పోలీస్ స్టేషన్ పనితీరుతో పాటు అక్కడ జరిగే కార్యకలాపాల గురించి దిశ స్పెషల్ అధికారిణి, DIG రాజకుమారి,  విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వారికి వివరించారు.

దిశ పోలీస్ స్టేషన్ ను క్షుణ్నంగా పరిశీలించిన కమిటీ సభ్యులు బాధిత మహిళల, చిన్నారుల భద్రత, పరిరక్షణకు ఎపి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలను కొనియాదారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్