Monday, July 8, 2024
HomeTrending News9న ప్రమాణ స్వీకారం ఉంటుంది: సజ్జల ధీమా

9న ప్రమాణ స్వీకారం ఉంటుంది: సజ్జల ధీమా

వైఎస్సార్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చేెనెల 9న ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం కౌంటింగ్‌ సమయంలో పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైఎయస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్‌ ఏజెంట్లకు వర్క్‌షాప్‌, జూమ్ మీటింగ్ జరిగాయి.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కౌంటింగ్ ఏజంట్లకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజంట్లకు సంబంధించి సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తమను సంప్రదిస్తే వారికి అవసరమైన సలహాలు,సూచనలు అందచేస్తారని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, పోస్టల్ బ్యాలెట్ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.  ప్రతి ఓటు విలువైనదేనన్నారు. ఎన్నికల కమీషన్ కు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశామని…. దానికి సంబంధించి ఆదేశాలు కూడా రాగానే తెలియజేస్తామన్నారు.

తెలుగుదేశం పార్టీ, చంద్రబాబులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటినుంచి వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా పనిచేస్తున్నారని, వాటిని వారికి అనుకూలంగా మలుచుకునే విధంగా కుయుక్తులు పన్నుతున్ననేపధ్యంలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల పట్ల అందరూ పూర్తి అవగాహనతో ఉండాలని కోరారు. ఇటీవల కాలంలో ఈసి వ్యవహరిస్తున్నతీరు అనుమానాలకు తావిచ్చేలా ఉన్న నేపధ్యంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్