Wednesday, June 26, 2024
Homeసినిమా'పరువు' హత్యల నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్!

‘పరువు’ హత్యల నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్!

ఉదయాన్నే ఏ దినపత్రిక చూసినా, ఎక్కడో ఒక చోటున పరువు హత్యల గురించిన వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు .. సీరియల్స్ వచ్చాయి. ఇప్పుడు అదే తరహా కంటెంట్ తో వచ్చిన మరో వెబ్ సిరీస్ గా ‘పరువు’ కనిపిస్తుంది. నాగబాబు .. నివేదా పేతురాజ్ .. నరేశ్ అగస్త్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించిన సిరీస్ ఇది. సిద్ధార్థ్ నాయుడు – రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సిరీస్, ఇప్పుడు జీ 5లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. అయితే టైటిల్ ‘పరువు’ అంటూ పరువు హత్యలకు సంబంధించినదే అయినా, ప్రధానమైన కథాంశంగా వేరే పాయింట్ కనిపిస్తుంది.

పల్లవి అనే యువతి, తెలంగాణ ప్రాంతానికి చెందిన సుధీర్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. తన ఇంట్లోని వారికి ఇష్టం లేకపోయినా అతణ్ణే పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజున తన పెదనాన్న చనిపోయాడనే విషయం తెలిసి, తనభర్తతో కలిసి ఆ ఊరికి ఆమె బయల్దేరుతుంది. ఆ ప్రయాణం ఆ దంపతుల జీవితాన్ని ఎలాంటి అనూహ్యామైన మలుపు తిప్పిందనేది కథ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్