Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పాస్ పోర్ట్ సేవలు పునఃప్రారంభం

పాస్ పోర్ట్ సేవలు పునఃప్రారంభం

విజయవాడలో పాస్ పోర్ట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కేంద్రం పరిధిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి  సేవలను అధికారులు ప్రారంభించారు. అత్యవసరమైన వారికి సేవలందించాలన్న లక్ష్యంతోనే రోజుకు 3 గంటల పాటు పని చేయాలని నిర్ణయించారు.

సాధారణ సమయంలో రోజూ సగటున 250 వరకు పాస్పోర్టు దరఖాస్తులను పరిశీలిస్తుంటారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కార్యాలయం పనిచేస్తుంది.కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రతి రోజూ చాలా తక్కువ సంఖ్యలోనే స్లాట్స్ కల్పించాలని అధికారులు నిర్ణయించారు . అత్యవసరమైతేనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్