Wednesday, March 11, 2026
HomeTrending NewsT Cabinet:మంత్రి మహేందర్ రెడ్డికి గనులు, సమాచార శాఖ

T Cabinet:మంత్రి మహేందర్ రెడ్డికి గనులు, సమాచార శాఖ

ఎమ్మెల్సీ, డా. పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ మినిస్టర్ గా గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గవర్నర్ తో కలిసి తన మంత్రి మండలి సభ్యులందరితో గ్రూపు ఫోటో సెషన్ లో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డా. పట్నం మహేందర్ రెడ్డికి సిఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, తదితర ప్రజాప్రతినిధులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

మంత్రి మహేందర్ రెడ్డికి భూగర్భ గనుల శాఖ, సమాచార శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular