చట్టం అందరికీ సమానంగా న్యాయం చేయగలిగితే కుల సమూహాలుగా ఏర్పాడాల్సిన అవసరం ఉండేది కాదని, డా. అంబేద్కర్ కోరిన కుల నిర్మూలన జరిగి ఉండేదని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పు కాపుల్లో బలమైన నేతలున్నా వారు తన సామాజిక వర్గానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. తూర్పు కులాన్ని అడ్డం పెటుకొని రాజకీయంగా ఎదిగారని కానీ ఆ తర్వాత కులాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళ్తున్నారని, తాము అధికారంలోకి రాగానే బిసి గణాంకాలు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజనతో ఈ వర్గానికి తీవ్రమైన నాస్తం జరిగిందన్నారు. భీమవరంలో పవన్ సమక్షంలో పలువురు తూర్పు కాపు నేతలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ బొత్స లాంటి నేతలు తమ కులంలో ఉన్న యువకులను రాజకీయంగా పైకి తీసుకొని వస్తే బాగుందేదన్నారు.
తెలంగాణాలో కళింగ, తుర్పు కాపు, గవర, సెట్టిబలిజ, నాగవడ్డిలు లాంటి 26 కులాలను బిసి జాబితా నుంచి తొలగిస్తే ఇక్కడి సిఎం కనీసం మాట్లాడలేదని, తన 300 ఎకరాల ఆస్తిని కాపడుకోవడంకోసం ఉమ్మడి ఆస్తులన్నీ ఆ రాష్ట్రానికి రాసిచ్చేశారని విమర్శించారు. ఇలాంటి అంశాలు చూసినప్పుడు తనకు ఎంతో ఆవేదన కలుగుతుందని, ఆవేశంతో ఊగిపోతానని అంతే తప్ప అలా చేయడానికి తనకు పిచ్చిలేదని స్పష్టం చేశారు. రోడ్లపై తిరిగి ప్రజల కష్టాలు విన్నప్పుడు తనకు గుండె చెరువు అవుతుందని అన్నారు. ఓడిపోయేందుకు సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని పునరుద్ఘాటించారు.