Sunday, January 19, 2025
Homeసినిమామామా అల్లుళ్ళ సినిమా మొదలయ్యేది ఎప్పుడు?

మామా అల్లుళ్ళ సినిమా మొదలయ్యేది ఎప్పుడు?

Start Soon: : “ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ రీ ఎంట్రీలో ఒక సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేస్తార‌నుకుంటే.. వ‌రుస‌గా సినిమాలు అనౌన్స్ చేసి అభిమానుల‌నే కాకుండా అంద‌ర్నీ స‌ర్ ఫ్రైజ్ చేశారు. రీసెంట్ గా ‘భీమ్లా నాయ‌క్’ తో స‌క్సెస్ సాధించారు. ప్ర‌స్తుతం క్రిష్ డైరెక్ష‌న్ లో ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎంర‌త్నం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

అయితే.. ఈపాటికే ‘భ‌వ‌దీయుడు భ‌గత్ సింగ్’  స్టార్ట్ కావాలి కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఈ సినిమా స్టార్ట్ కాకుండానే.. మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ తో క‌లిసి ఓ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓకే చెప్పార‌ని తెలిసింది. ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇది త‌మిళంలో విజ‌యం సాధించిన ‘వినోద‌య‌మ్ సీత‌మ్’ చిత్రానికి రీమేక్. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ సినిమా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్  20 రోజులు డేట్స్ ఇస్తే స‌రిపోతుంద‌ట‌. అందుక‌ని భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమా కంటే ముందుగా ఈ సినిమా కోసం ప‌వ‌న్ డేట్స్ ఇచ్చార‌ని స‌మాచారం. ఈ మూవీ ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. తాజా స‌మాచారం ప్ర‌కారం జులై నుంచి ఈ చిత్రాన్ని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. మ‌రి.. మేన‌మామ ప‌వ‌న్, మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి చేయ‌నున్న మూవీ అంటే అభిమానుల‌కు పండ‌గే.

Also Read : ప‌వ‌ర్ స్టార్ మూవీలో సర్పంచ్ నాగలక్ష్మి?

RELATED ARTICLES

Most Popular

న్యూస్