Saturday, January 18, 2025
Homeసినిమామ‌రో మూవీకి పవన్ గ్రీన్ సిగ్న‌ల్?

మ‌రో మూవీకి పవన్ గ్రీన్ సిగ్న‌ల్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు‘ అంటూ పాన్ ఇండియా మూవీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు యాభై శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. స‌మ్మ‌ర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సినిమాతో పాటు హ‌రీష్ శంక‌ర్ తో ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’, సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ లో ఓ భారీ చిత్రం, స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేయ‌నున్నారు. వీటితో పాటు ప‌వ‌ర్ స్టార్ మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నారంటే.. సాహో డైరెక్ట‌ర్ సుజిత్ అని స‌మాచారం. సాహో త‌ర్వాత సుజిత్ లూసీఫ‌ర్ రీమేక్ గాడ్ ఫాద‌ర్ మూవీని డైరెక్ట్ చేయాలి కానీ.. సుజిత్ చేసిన మార్పులు చేర్పులు న‌చ్చ‌క‌పోవ‌డంతో త‌ప్పుకున్నాడు.

ఇటీవలే పవన్‌ని కలిసిన సుజిత్‌..  స్క్రిప్టు మొత్తం వినిపించాడని, పవన్‌కు ఈ కథ బాగా నచ్చి ఓకే చెప్పార‌ని తెలిసింది. ఈ చిత్రాన్ని డివివి దాయన్య నిర్మించ‌నున్నారు. ఆయనతో పాటు నిర్మాణ బాధ్యతలు త్రివిక్రమ్‌ సైతం పంచుకోబోతున్నారని స‌మాచారం. మ‌రి.. సుజిత్ ఈ అవ‌కాశాన్ని ఎంత వ‌ర‌కు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

Also Read : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు‘ ప్రచార చిత్రం విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్