Saturday, March 14, 2026
HomeTrending Newsసొంత పుత్రుడిపై నమ్మకం లేకే..: గుడివాడ

సొంత పుత్రుడిపై నమ్మకం లేకే..: గుడివాడ

Behind Babu: పవన్ కళ్యాణ్ ఎప్పటికీ చంద్రబాబుకు దత్తపుత్రుడేనని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సొంత పుత్రుడిపై నమ్మకం లేక దత్తపుత్రిడిని చంద్రబాబు తెచ్చి పెట్టుకున్నారని అన్నారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన రైతు భరోసా యాత్రలో పవన్ చేసిన విమర్శలపై అమర్నాథ్ స్పందించారు. పార్టీ పెట్టినప్పటినుంచీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రయోజనాలకోసమే పనిచేస్తూ వస్తున్నారని, ఐదేళ్ళల్లో ఆరు పార్టీలతో పొట్టు పెట్టుకున్న రికార్డ్ అయన సొంతమని ఎద్దేవా చేశారు.  ఎమ్మెల్యే అదీప్ రాజ్ తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు దర్శకత్వంలో మూడు నెలలుగా పవన్ ఓ సినిమా నడుపుతున్నారని, కానీ చివరకు ఇది అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకుండా  ఉండేందుకు అయన తాపత్రయ పడుతున్నారని కానీ ఆ ప్రయత్నం ఫలించబోదని ధీమా వ్యక్తం చేశారు. అక్రమంగా జగన్ ను జైల్లో నిర్భందిస్తే ఆయన్ను నేరగాళ్ళు అని వ్యాఖ్యానించడం ఏమిటని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.

రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, ‘విత్తనం నుంచి విక్రయం దాకా’ అనే నినాదంతో వారికి ఎన్నో విధాలుగా సహకారం అందిస్తున్నామని, రైతుల గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదని మంత్రి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular