ఒకప్పుడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మధ్య గట్టి పోటీ ఉండేది. ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర నువ్వా…? నేనా..? అన్నట్టుగా పోటీపడేవారు. అయితే.. వీరిద్దరి మధ్య మంచి అనుబంధ ఉంది. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా పైరసీకి గురైనప్పుడు మహేష్ బాబు స్వయంగా పైరసీ చేసిన షాపు పై దాడి చేయడం సంచలనం అయ్యింది. ఆ టైమ్ లో మహేష్ కు పవన్ సపోర్ట్ గా నిలిచారు. ఫిలిం ఛాంబర్ లో కలుసుకుని పైరసీ పై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితులు.
ఆ స్నేహం కారణంగా పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. అది అప్పట్లో సంచలనం అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయ్యారు. వారాహి యాత్ర చేస్తూ మరింతగా ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే.. పొలిటికల్ ప్రసంగాల్లో భాగంగా హీరోల్లో తన స్థాయి ఏంటనే విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా బయటపెట్టడం విశేషం. ఇంతకీ పవన్ ఏమన్నారంటే… ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరోల్లో తనకంటే ప్రభాస్, మహేష్ పెద్ద హీరోలని అన్నారు. ప్రభాస్ నా కంటే పెద్ద హీరో. మహేష్ బాబు నా కంటే పెద్ద హీరో. ఈ విషయం చెప్పడానికి నాకేం ఇగో లేదు అని చెప్పారు.
వాళ్లు పాన్ ఇండియా హీరోలు. రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు, ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. నేను ప్రపంచ వ్యాప్తంగా తెలియదు. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఇగోస్ లేవు అని చెప్పారు పవర్ స్టార్. అంతే కాకుండా తనకు అందరు హీరోలు ఇష్టమేనని.. ఫ్యాన్స్ వార్ వద్దని కోరారు. తనకు ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, చరణ్, చిరంజీవి, బాలకృష్ణ.. ఇలా హీరలందరూ ఇష్టమే అని.. వాళ్ల సినిమాలు చూస్తాను.. కనిపిస్తే మాట్లాకుంటాం. వాళ్లతో ఎలాంటి సమస్యలు లేవు అని పవన్ చెప్పారు. ఇన్ డైరెక్ట్ గా అందరి హీరోల అభిమానులు తనకు ఓటు వేయాలి అన్నట్టుగా మాట్లాడారు. మరి.. పవన్ ప్రయత్నం ఫలిస్తుందా..?