Saturday, March 14, 2026
Homeసినిమాపవన్, సుజిత్ మూవీ అఫిషియల్ అనౌన్స్ మెంట్

పవన్, సుజిత్ మూవీ అఫిషియల్ అనౌన్స్ మెంట్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమాని ఎప్పుడో ప్రారంభించారు. కరో్నా కారణంగా కొన్నాళ్లు షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆతర్వాత పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడం వలన మరింత ఆలస్యం అయ్యింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. అందుకనే సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

అయితే.. గత కొన్ని రోజులు నుంచి పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో సినిమా అంటూ వార్తలు వచ్చాయి. ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించనున్నారని టాక్ వినిపించింది. అంతే కాకుండా ఈ సినిమాని సెట్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అని.. సుజిత్ చెప్పిన కథ విని మార్పులు చేర్పులు చెప్పారని అంతా సెట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే.. హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ ఇంకా స్టార్ట్ చేయకుండా మరో సినిమా చేస్తారా..? అనే అనుమానం ఉండేది.

ఆ డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ పవర్ స్టార్, సుజిత్ తో మూవీని అనౌన్స్ చేశారు. మరో విషయం ఏంటంటే.. ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్ తో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ లో కొన్ని జాపనీస్ పేర్లు అలాగే హ్యాష్ ట్యాగ్ తో ‘ఓజి’ అంటూ హైలైట్ చేశారు. అలాగే పవన్ నిల్చున్న పోస్టర్ చూస్తే.. ఓ గన్ కూడా కనిపిస్తుండడం కేజ్రీగా ఉంది. మొత్తానికి అయితే… ఓ సెన్సేషనల్ సినిమానే మేకర్స్ సెట్ చేసారని చెప్పాలి. మరి.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..?  ఎప్పుడు రిలీజ్ చేస్తారో..?  క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular