Friday, March 20, 2026
HomeసినిమాPawan Kalyan: పవన్, సూరి మూవీ రీమేకా..?

Pawan Kalyan: పవన్, సూరి మూవీ రీమేకా..?

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా రీమేక్ మూవీ. ఈ సినిమా తర్వాత చేసిన భీమ్లా నాయక్, ‘బ్రో’ చిత్రాలు కూడా రీమేక్ చిత్రాలే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రీమేక్ మూవీనే. అయితే.. ఇటీవల పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్. వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ మూవీని ఇప్పుడు ప్రారంభించారు.

అయితే.. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది రీమేక్ మూవీనా..? ఓరిజినల్ స్టోరీతో రూపొందే మూవీనా..? అనేది ఆసక్తిగా మారింది. ఓ హాలీవుడ్ మూవీ స్టోరీ ఆధారంగా ఈ సినిమా కథను వక్కంతం వంశీ రెడీ చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే.. మరో వైపు ఇది రీమేక్ మూవీ కాదు.. ఓరిజినల్ స్టోరీతో రూపొందే సినిమా అని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇది సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలిసి తయారు చేసిన కథ అని ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆతర్వాత ‘ఓజీ’ షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ రెండు సినిమాల తర్వాత వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేయాలి. ఆతర్వాత అప్పుడు సురేందర్ రెడ్డితో సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇదంతా జరగడానికి చాలా టైమ్ పడుతుంది. అందుచేత పవన్, సురేందర్ రెడ్డి సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కానీ.. సెట్స్ పైకి ఎప్పుడు వస్తుంది అనేది క్లారటీ లేదు. ఇక.. రీమేకా, ఓరిజినల్ స్టోరీతో రూపొందే మూవీనే విషయం పై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular