Friday, October 18, 2024
HomeసినిమాHari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' నుంచి అదిరిన కొత్త పోస్టర్...

Hari Hara Veera Mallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిన కొత్త పోస్టర్…

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ‘హరిహర వీరమల్లు’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో క్యూరియాసిటి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఇక ఇప్పుడు పవన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అర్ధరాత్రి 12.17 నిమిషాలకు కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో పవన్ ఒక యోధుడిగా కనిపిస్తున్నారు. గుబురు గడ్డంతో, చాలా సీరియస్ లుక్ తో పవన్ ఉన్నారు. ఈ పోస్టర్ ఒక ఫైట్ సీన్ కు సంబంధించినదని తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నికల లోపు ఈ సినిమాను పవన్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరిమితమైన కరుణ కలిగిన పవన్ పుట్టినరోజును ఈ సంతోషకమైన రోజున జరుపుకుంటున్నామని ట్వీట్ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్