Friday, March 13, 2026
Homeసినిమాఅల్యూమినియం ఫ్యాక్టరీలో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’

అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పాన్ ఇండియా స్టార్ రానా కాంబినేషన్లో మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడిన ఈ మూవీ షూటింగ్ ను రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఇందులో పోలీసాఫీసర్ గా భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వారం క్రితమే పవన్‌కు జోడీగా నటిస్తున్న నిత్యామీనన్‌ సెట్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరితో పాటు మురళీశర్మ, కాదంబరి కిరణ్‌ తదితరుల పై పోలీస్‌ స్టేషన్‌లో సాగే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular