Saturday, January 18, 2025
Homeసినిమాతమిళ ఇండస్ట్రీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన పవర్ స్టార్

తమిళ ఇండస్ట్రీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన పవర్ స్టార్

తమిళ సినీ పరిశ్రమ ఇటీవల ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే.. తమిళ సినిమాల్లో తమిళ నటీనటులే నటించాలి. అలాగే తమిళ సాంకేతిక నిపుణులే వర్క్ చేయాలి అని ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. దీని పై తమిళ ఇండస్ట్ట్రీలోనే విమర్శలు వస్తున్నాయి. కారణం ఏంటంటే.. ఇప్పుడు హద్దులు, సరిహద్దులు చెరిగిపోయి.. తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ కి ఎదిగింది. పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ అంటూ సినిమాలు తీస్తున్నాం. ఇలాంటి టైమ్ లో తమిళ సినిమాల్లో తమిళయన్స్ మాత్రమే నటించాలి.. టెక్నీషియన్స్ వాళ్లే ఉండాలి అనడం తప్పుడు ఆలోచన అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదే అంశం గురించి పవన్ కళ్యాణ్‌ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడి షాక్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే.. తమిళ ఇండస్ట్రీకి పవర్ స్టార్ కౌంటర్ ఇచ్చారని చెప్పచ్చు. ఇంతకీ పవర్ స్టార్ ఏమన్నారంటే.. తమిళ ఇండస్ట్రీ ఇటీవల ఓ నిర్ణయం తీసుకుందని తెలిసింది. తమిళ సినిమాల్లో తమిళియన్స్ మాత్రమే నటించాలి. వాళ్లే టెన్నీషియన్స్ ఉండాలని. అది సరైన నిర్ణయం కాదు. తెలుగు సినిమా పరిశ్రమ అన్ని భాషల వాళ్లను అక్కున చేర్చుకుంటుంది. టాలెంట్ ఉందనపిస్తే ప్రొత్సహిస్తుంది. అందుకే ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ హాలీవుడ్ రేంజ్ కి ఎదిగింది.

తమిళ సినిమా పరిశ్రమ నుంచి కూడా ఆర్ఆర్ఆర్ లాంటి హాలీవుడ్ రేంజ్ కి వెళ్లే సినిమాలు రావాలి. కేవలం వాళ్ల సినిమాల్లో వాళ్లే నటించాలి లాంటి నిర్ణయాలు తీసుకుంటే.. ఇండస్ట్రీ ఎదుగుదల ఉండదు. అక్కడే ఆగిపోతుంది. ఏదైనా సమస్యలు ఉంటే.. వేరేలా ఆలోచించండి కానీ.. ఇలాంటి నిర్ణయం సరైనది కాదని చెప్పి గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతే కాకుండా తమిళ సినీ పెద్దలు దీని గురించి ఆలోచించాలని కోరుతున్నాను. ఈ విషయాన్ని తమిళయన్ అయిన సముద్రఖని సమక్షంలో చెబుతున్నాను అని పవన్ అన్నారు. మరి.. పవర్ స్టార్ వ్యాఖ్యల పై తమిళ ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్