Sunday, January 19, 2025
HomeTrending NewsBCs: పవన్ బిసి అంటే అర్ధం ‘బాబు క్లాస్’: జోగి

BCs: పవన్ బిసి అంటే అర్ధం ‘బాబు క్లాస్’: జోగి

బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.  బీసీలకు సామాజికంగా, రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన ఘనత సిఎం జగన్ కే దక్కుతుందని, బిసిల ఆత్మగౌరవం తలెత్తుకు తిరిగేలా చేశారని అన్నారు. బిసిల స్థితిగతుల మీద, ఆర్ధిక, రాజకీయ అంశాలపై పవన్ కు ఏం తెలుసని నిలదీశారు.  తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కాల్యాలయంలో జోగి మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ బాబుకు బానిస అని, అయన బిసిలను ఏం ఉద్దరిస్తారని, తాము ఎలా నమ్మాలని జోగి ప్రశ్నించారు.  పవన్ దృష్టిలో బిసి అంటే బాబు క్లాస్ అని అభివర్ణించారు.

బిసి డిక్లరేషన్ ఇవ్వడానికి పవన్ కు ఉన్న అర్హత ఏమిటని, అసలు ఆ పార్టీ 175 సీట్లకు పోటీ చేయాలని, ఒక మేనిఫెస్టో ఉండాలని, కానీ మొత్తం సీట్లకు పోటీ చేస్తామని చెప్పలేని వారికి డిక్లరేషన్ ఇచ్చే నైతికత ఏం ఉంటుందని నిలదీశారు.

బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనార్టీలు ఇది తమ ప్రభుత్వం అని భావిస్తున్నారని, రాబోయే 30 ఏళ్ళపాటు రాష్ట్రంలో వైఎస్సార్ జెండాను రెపరెపలాడిస్తామని జోగి ధీమా వ్యక్తం చేశారు. తమలో చీలిక తెచ్చేందుకు పవన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. 2 లక్షల కోట్ల రూపాయలు డిబిటి ద్వారా పేదలకు అందిస్తే వాటిలో లక్ష కోట్ల రూపాయలు బిసిలకు అందాయని, కనీసం లోకజ్ఞానం, లెక్కలు తెలియకుండా పవన్ మాట్లాడుతున్నారని జోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ మధ్యలో వచ్చి ఒక మీటింగ్ పెట్టి, స్టేట్మెంట్ ఇచ్చి వెళుతున్నారని ధ్వజమెత్తారు.  ఎంతమంది కలిసి కట్టుగా వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని జోగి స్పష్టం చేశారు.

గత 70 ఏళ్ళలో సామాజిక న్యాయం రాష్ట్రంలో ఎలా జరిగిందో, ఈ మూడేళ్ళలో ఎలా జరిగిందనే అంశంపై బహిరంగ చర్చకు రావాలని రమేష్ సవాల్ విసిరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్