యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి ఈ ముగ్గురు కలయికలో రూపుదిద్దుకున్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన సినిమా కావడం.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆర్ఆర్ఆర్ సంచలన విజయం సాధించింది. 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే గోల్డన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకోవడం.. ఆస్కార్ బరిలో నిలవడంతో ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది.
అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదిక పై మరోసారి సత్తా చూపించింది. ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో విదేశీ చిత్రాలతో పోటీ పడుతూ ఏకంగా నాలుగు పురస్కారాల్ని సాధించింది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంతో పాటు ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ స్టంట్స్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఈ సందర్భంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆర్ఆర్ఆర్ టీమ్ ని అభినందిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అయితే.. పవన్ కళ్యాణ్ అభినందనలో ఎన్టీఆర్ పేరు ప్రస్థావించకపోవడం ఇప్పుడు చర్చనీయంశమైయింది. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఆర్‌ఆర్‌ఆర్ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదిక పై బెస్ట్ వాయిస్, మోషన్ కాప్చర్ పెర్ఫార్మెన్స్ ను రామ్‌చరణ్ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్‌చరణ్‌కు, దర్శకుడు రాజమౌళికి, చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమా అంటే చరణ్ ఒక్కడే నటించిన సినిమా కాదు.. ఎన్టీఆర్ కూడా నటించారు. ఈ సినిమాకి వచ్చిన విజయాలు, అవార్డులు ఇద్దరికీ చెందుతాయి. తారకరత్న చనిపోయాడనే బాధలో ఉండడంతో ఎన్టీఆర్ ఆ అవార్డ్ ఈవెంట్ కి వెళ్లలేకపోయారు. అయితే.. పవన్ కళ్యాణ్ ఇలా చరణ్ ని మాత్రమే అభినందించి.. ఎన్టీఆర్ గురించి ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
Also Read : జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన చరణ్